రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ చిరస్థాయిగా నిలిచిపోయింది
– హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : తెలంగాణా రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పేరు ప్రత్యేకంగా నిలిచిందని హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నగర గ్రంథాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజరై చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో చాకలి ఐలమ్మ ప్రేరణాత్మక చిహ్నంగా ఉందన్నారు. తెలంగాణాలోని రైతాంగ ఉద్యమంలో ఒక ప్రతిఘటన ప్రతీకగా నిలిచిన వీర మహిళ ఐలమ్మ అని అన్నారు. అప్పటి వరకు స్త్రీలు ఇలాంటి సాయుధ పోరాటంలో పెద్దగా పాల్గొనలేదని… ఐలమ్మ పోరాటం వలన మహిళలు కూడా ధైర్యంగా ఉద్యమంలోకి వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ వన్ లైబ్రేరియన్ చంద్రకళ, వెంకటేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డి, మహేందర్, వరప్రసాద్, పిడి మహేష్, ముత్యం, అమరావతి, భాగ్య, మహేశ్వరి, సునీత, సుగ్రీవ తదితర ఉద్యోగస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply