చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
– తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్ పులిగారి గోవర్థన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : ప్రతి ఒక్క మహిళ చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కవాడిగూడలోని ఆమె విగ్రహానికి పూలమాలలేసిన పులిగారి గోవర్థన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులిగారి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచంలో అనేక దేశాల్లో రాజ్యాధికారం కోసం ఉద్యమాలు, యుద్ధాలు జరిగాయి కానీ… తెలంగాణలో మాత్రం భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడిదే భూమి అంటూ పోరాటం జరిగిందన్నారు. రాజరికానికి, భూస్వాముల ఆధిపత్య ఆరాచకాలకు, వెట్టిచాకిరి, దౌర్జన్యాలకు తెలంగాణ ప్రాంత బహుజనుల భావిసత్వానికి, సమానత్వం కోసం జరిగిన మహా సంగ్రామమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని అన్నారు. వర్తమాన కాలంలోని యువతకు ఐలమ్మ జీవితం ఆదర్శమన్నారు. ఆమె ధైర్యం, పట్టుదల, సమూహబలం, మహిళ నాయకత్వం సామాజిక న్యాయం, ప్రేరణ, మార్గదర్శకం తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply