హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపి సీఎం చంద్రబాబునాయుడు బర్త్ డే వేడుకలు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం పేదలకు పులిహోర ప్యాకెట్లను, బిస్కెట్లను అందచేశారు. ఈ సందర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ… సైబారాబాద్‌ను రూపొందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోనే తెలుగువారి ఖ్యాతిని పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చంద్రమోహన్‌గౌడ్, శంకర్, యాదగిరి, ఉదయ్ గుప్త, శ్రీనివాస్, వీణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply