FIFA World Cup – 2026 : ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్పోర్ట్స్, జూలై 7, ( అద్దం న్యూస్ ) :   ఫీఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా అర్జెంటినా, ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై సంక్షేమ పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్‌ను తిలకించారు. ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య వీక్షణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటినా 3-2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గత డిసెంబర్‌లో హైదరాబాద్ సందర్శించడమే కాకుండా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రీడాభిమానులను అలరించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page