ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు

హైదరాబాద్, జులై 29, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు అపర్ణ, వందన, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్ తదితరులు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోక్సో ( POCSO ) కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, కమిషన్ నిర్వహించిన పర్యటనలు, కార్యక్రమాల నివేదికను అందించారు. రాష్ట్రంలో కేవలం నిలోఫర్ హాస్పిటల్ మాత్రమే పిల్లలకు ప్రత్యేకంగా సేవలందిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ అన్ని జిల్లాల్లో ప్రత్యేక చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని, చైల్డ్ రైట్స్ కమిషన్ అందిస్తున్న సేవలను శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అభినందించారు. కమిషన్ మరింత విజయవంతంగా పలు కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలని సూచించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply