Friday, September 18, 2026
HomeHyderabadఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ స‌భ్యులు

ఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ స‌భ్యులు

ఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తితో భేటీ అయిన చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ స‌భ్యులు


హైదరాబాద్, జులై 29, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, కమిషన్ సభ్యులు అపర్ణ, వందన, చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్ త‌దిత‌రులు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతిని మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పోక్సో ( POCSO ) కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాల‌ని, కమిషన్ నిర్వహించిన పర్యటనలు, కార్యక్రమాల నివేదికను అందించారు. రాష్ట్రంలో కేవలం నిలోఫర్ హాస్పిటల్ మాత్రమే పిల్లలకు ప్రత్యేకంగా సేవలందిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ అన్ని జిల్లాల్లో ప్రత్యేక చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని, చైల్డ్ రైట్స్ కమిషన్ అందిస్తున్న సేవలను శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అభినందించారు. కమిషన్ మరింత విజయవంతంగా పలు కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలని సూచించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page