Saturday, September 19, 2026
No menu items!
Homecinemaప్రమోషన్లలో కనిపించని చిరంజీవి.. రీజన్ అదేనా..?

ప్రమోషన్లలో కనిపించని చిరంజీవి.. రీజన్ అదేనా..?

📰 Generate e-Paper Clip

ప్రమోషన్లలో కనిపించని చిరంజీవి.. రీజన్ అదేనా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ప్రమోషన్లలో చిరంజీవి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన మోకాలి సర్జరీ చేయించుకొని వైద్యుల సూచన మేరకు విశ్రాంతిలో ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా, టికెట్ ధరల పెంపు అంశంపై నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమా మరింత హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా చిరంజీవి తన సినిమాల ప్రమోషన్లలో స్వయంగా పాల్గొని మీడియా ఇంటర్వ్యూలు,ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటంతో “చిరు ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు?” అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ అంశంపై సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, చిరంజీవి ఇటీవల మోకాలి సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మోకాలి నొప్పులతో ఇబ్బంది పడుతున్న ఆయన, సినిమా షూటింగ్ పూర్తయ్యాక డాక్టర్ల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారని టాక్.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page