హైదరాబాద్, మే 26, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, కవాడిగూడ, ముషీరాబాద్ డివిజన్లకు చెందిన లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సోమవారం జరిగింది. గాంధీనగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై 12 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, రాంనగర్ అధ్యక్షుడు శంకర్, కవాడిగూడ, రాంనగర్ డివిజన్ల ప్రధాన కార్యదర్శులు సాయికృష్ణ, దామోదర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొల్లగడ్డ రాజశేఖర్‌గౌడ్, పులిగిల్ల శ్రీధర్‌చారి, రాజేష్, వల్లాల రవి యాదవ్, బల్ల ప్రశాంత్, బల్వంత్, సంతోష్, మధు, దీన్‌దయాల్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply