గుండెల్లి దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి సన్మానం
హైదరాబాద్, మే 21, ( అద్దం న్యూస్ ) : రాష్ట్ర సచివాలయం వద్ద భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శి, ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డు సభ్యుడు గుండెల్లి దేవీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ… భారత దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశంలో కమ్యూనికేషన్ విప్లవ పితామహుడన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.













Leave a Reply