తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డుకు ఎంపికయ్యారు. కేరళకు చెందిన దిగ్గజ నేత, మాజీ మంత్రి దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ( AMF ) ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గానూ ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ తెలిపారు. అవార్డు ఎంపికకు ఎంపీ బెన్నీ బెహనన్, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎపి.అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్యవహరించారు. ప్రజాస్వామిక విలువలపై రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో ఈ నెల 25 వ తేదీ శుక్రవారం ( నేడు ) జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేయనున్నారు. వేడుకలో ఆర్యదాన్ ముహమ్మద్ స్మారక ఉపన్యాసాన్ని ఎంపీ కేసీ వేణుగోపాల్ చేస్తారు.
‘ ఆర్యదాన్ ముహమ్మద్–2026 ’ అవార్డుకు ఎంపికైన సీఎం రేవంత్ రెడ్డి
RELATED ARTICLES

