బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కేబినెట్ నిర్ణయం హర్షణీయం
హైదరాబాద్, జులై 12, అద్దం న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం హర్షణీయమని డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్, ఉపాధ్యక్షుడు కాటమోని వెంకటేష్‌గౌడ్ లు అన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లి డిఎస్‌డి కార్యాలయంలో వారు మాట్లాడుతూ… దివ్యాంగులకు స్థానిక సంస్థలకు ఎన్నికల్లో రిజర్వేషన్ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేయనున్న నేపధ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, బిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply