బీసీలను నమ్మించి ద్రోహం చేసిన కాంగ్రెస్
– మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన
గన్‌పార్క్, నవంబర్ 27, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి ద్రోహం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ గన్‌పార్క్‌లో గల అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మసిపూసి మామిడికాయ చేసి బిసి రిజర్వేషన్లకు గండి కొట్టారని ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,735 గ్రామ పంచా యతీల్లో బీసీలకు కేవలం 2,176 స్థానాలు మాత్రమే కేటాయించడం బాధాకరమ న్నారు. కులగణన లెక్కలను బయట పెట్టడం, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం, కేంద్ర నాయకులను కలవడం లాంటివేవి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదని విమర్శించారు. ఇండియా కూటమికి 200 పైగా ఎంపీలు ఉన్నారని, కానీ ఒక్కరూ పార్లమెంట్‌లో మాట్లాడరని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనైనా బిసిల పక్షాన మాట్లాడి సభను స్థంభింపచేయాలన్నారు. బీసీలను రాజకీయంగా తీవ్ర అన్యా యానికి గురి చేశారన్నారు.
రిజర్వేషన్లు పెంచుతామని తగ్గించారని మండిపడ్డారు. రెండు సంవత్సరా లుగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను మోసం చేసిందని అన్నారు. జీవో 46 అమలు చేయడం తీవ్ర అన్యాయమని, స్థానిక ఎన్నికలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా ఉరి తీశారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఫోరం అధ్యక్షుడు యాదయ్య, రాజు, కుమార్, రవి, జగదీష్, ప్రవీణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()














Leave a Reply