...

చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్న‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్న‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    ఒక వైపు కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిలో పన్ను సవరణలను చేపట్టి పేద మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రయత్నంలో ఉంటే ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అధికారులకు టార్గెట్లను నిర్దేశించి చిన్న, మధ్యతరగతి వ్యాపారులను అక్రమంగా వేదిస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… కరోనా సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడిపుడే నిలదొక్కుకుంటున్న చిన్న మధ్యతరగతి వ్యాపారులను పాత బకాయిల పేరుతో వేదిస్తున్నార‌న్నారు. వ్యాపారుల బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తూ అధికారిక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిప‌డ్డారు. తమకు సహకరించిన వ్యాపారాస్థుల బెదిరిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలించే ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా వ్యాపారులను వేదిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

రాహుల్ గాంధీ జిఎస్‌టి పై నిరసన చూస్తున్నారు… కాని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. కర్ణాటక రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కూరగాయల వ్యాపారులను సైతం వదలకుండా పన్నుల కోసం పీడిస్తుంటే అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసిన ఉదంతం పత్రికల ద్వారా ప్రజలందరికి విధితమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిన్న, మధ్య తరగతి వ్యాపారులను పన్నుల పేరుతో వేదింపుల‌కు గురి చేస్తున్నారని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులు మానుకోకపోతే ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొనవలసి వస్తుందని సాయిబాబా హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల‌ కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, నాగు నగేష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.