హైదరాబాద్, అద్దం న్యూస్ : పేదల అభివృద్ధి కోసం ప్రయోజనకరమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని గురువారం గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీ లత రెడ్డి మాట్లాడుతూ… “సన్నబియ్యం పంపిణీ పథకం పేదల ఆరోగ్యం కోసం చిత్తశుద్ధితో రూపొందించిందన్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు పోషకాలు సమృద్ధిగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇందులో భాగంగా సన్నబియ్యం పథకంతో పాటు పేదలకు ఉచిత విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ పథకాలు సామాజిక న్యాయం లక్ష్యంగా ఉంచుకొని ప్రజలకు మేలు చేయాలని సంకల్పించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని తమ అనుభూతులను వ్యక్తం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply