hcu university
హైదరాబాద్, ఏప్రిల్ 01, అద్దం న్యూస్ : నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారన్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ శక్తులకు భూములను అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సియు భూములను అమ్మేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందన్నారు. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శించారు. విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘలనలకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే పోలీసులు అర్దరాత్రి నుండి జిల్లాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గపు చర్య అని అన్నారు. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని ఎస్‌ఎఫ్‌ఐ హైదారాబాద్ జిల్లా కమిటి ఖండిసస్తుందన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరన్నారు. ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని కోరారు.













Leave a Reply