రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :     రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏనాడో ప్రేమ లేదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గత 3 నెలలుగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటూ, ఎవరాదుకుంటారా అని రాష్ట్ర రైతాంగ దిక్కులు చూస్తోందని, ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మావద్ద యూరియా లేదంటూ చేతులెత్తి వేయడం చాలా దారుణమైన విషయమని అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… రాబోయే సీజన్ లో రైతులకు యూరియా అత్యంత అవసరమని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన రీతిగా స్పందించకపోవడంతో వచ్చిన అనర్ధాలే ఇవన్నీ అని సాయిబాబా వాపోయారు. యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటల నుండే లైన్లలో నిలబడడం మహిళలు పిల్లలలో సహా లైన్లలో నిలబడుతున్నారు. యూరియా అందకపోయేసరికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుందని, యూరియా ఇవ్వడం లేదని గ్రోమోర్ సెంటర్లపై రాళ్ల దాడి చేశారన్నారు. దుకాణం బోర్డును చించేశారని, షాపు ఎదుట నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. నెల రోజులుగా క్యూలో నిలబడుతున్నా యూరియా దొరకడంలేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య తీవ్రతను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతాయి కానీ, ఆచరణ, అమలు చేయలేక ఫలితం శూన్యమ‌న్నారు. చివరికి ఎవరికి ఇచ్చారో తెలీదని.. ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. తప్పితే ఏమాత్రం సామాన్య ప్రజలకు అందడంలేదని అన్నారు. యూరియా విషయంలో కూడా “ఆడ లేక మధ్దెల ఓడు” అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు. తమకు పరిపాలన చేతకాక యూరియా నేపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేసి కాలం గడుపుతోందన్నారు.

పాలన అనుభవం లేక రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రి పరులపై నింద వేసి మా తప్పేమి లేదంటూ చేతులు దులుపుకుంటున్నారని విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పడం హాస్యాస్పదమ‌న్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఈ విధంగా అగచాట్ల పాలు చేయడం కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశంగా కనబడుతోందని అన్నారు. ఇకనైనా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేయాలని, బీసీల విషయంలో చేసినట్టు నిరాహార దీక్ష లాంటి డ్రామాలు ఆడ కుండా రైతుల కోసం పని చేయాలని అన్నారు. అందుకు అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సాయిబాబా కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, శ్యామ్ సుందర్, వెంకటేష్ చౌదరి, భానుప్రకాష్, సత్యనారాయణ, శుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page