బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే – రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్

బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే

– రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :   బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీదే అని తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ ( టిల్లు ) అన్నారు. బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకుగాను హైద‌రాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్ చౌర‌స్తాలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సంబురాలు జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ ముఖ్య అతిథిగా హాజ‌రై స్వీట్లు పంచిపెట్టి… రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం చేశారు. ఈ సంద‌ర్బంగా జై కాంగ్రెస్‌… జై రాహుల్ గాంధీ… జై సీఎం రేవంత్‌రెడ్డి అని ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించి నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించ‌డం చారిత్రాత్మ‌కమైన నిర్ణ‌యం అన్నారు. బిసిల‌కు న్యాయం చేస్తున్న‌ది ఒక్క కాంగ్రెస్ పార్టే అని అన్నారు. బిసిల ప‌ట్ల సీఎం రేవంత్‌రెడ్డికి చిత్త‌శుద్ధి ఉంద‌న్నారు. బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ తెచ్చిన బిల్లు వ‌ల్ల రాబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అమ‌లు జ‌రుగ‌బోతుంద‌న్నారు. బిసి బిల్లు తెచ్చిన విధానాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విడి.క్రిష్ణ‌, ఆర్‌.క‌ల్ప‌నా యాద‌వ్‌, మేడి సురేష్‌, బంటారం యాద‌గిరి గౌడ్‌, జ‌యేంద‌ర్ బాబు, మీసాల జ‌య‌ కుమార్‌,కేశ‌వ్‌, ర‌ఘు, న‌రేంద‌ర్‌, డాక్ట‌ర్‌.హ‌నీఫ్‌, పీట‌ర్‌, అతినగ‌రం సుధేష్‌, జ‌గ‌దీష్ బాబు, పెండెం శ్రీనివాస్‌, అభిషేక్, అన‌సూయ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page