Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADకాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో చ‌లి...

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో చ‌లి వేంద్రం ఏర్పాటు

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్
ఆధ్వ‌ర్యంలో
చ‌లి వేంద్రం ఏర్పాటు

ముషీరాబాద్‌, ఏప్రిల్ 24, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాకారం డివిజ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి, ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాల‌యం ట్ర‌స్ట్ బోర్డు స‌భ్యుడు గుండెల్లి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో చ‌లి వేంద్రం కేంద్రం ప్రారంభోత్స‌వం జ‌రిగింది. శుక్రవారం డివిజ‌న్‌లోని రాజా డీల‌క్స్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్ హాజ‌రై చ‌లి వేంద్రం కేంద్రాన్ని దేవి వ‌ర ప్ర‌సాద్‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… వేసవి కాలంలో ప్ర‌జ‌ల దాహార్థిని తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో చ‌లి వేంద్రం ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ మాట్లాడుతూ… ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కార్మికులకు, పాదచారులకు, బాటసారుల దాహం తీర్చ‌డానికి చల్లటి త్రాగు నీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అంజిరెడ్డి, వెంక‌టేష్‌, కొండ‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page