Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADమార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దాం

మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దాం

📰 Generate e-Paper Clip

మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దాం
– సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి కేంద్ర కమిటి సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు

హైదరాబాద్, ఏప్రిల్ 22, అద్దం న్యూస్ :   మార్క్సిజం-లెనిజం-మావో ఆలోచన విధానాన్ని వెలుగులో పురోగమిద్దామ‌ని సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు అన్నారు. సిపిఐ ( ఎం-ఎల్ ) 57వ ఆవిర్భావం సందర్భంగా హైద‌రాబాద్‌ విద్యానగర్ మార్క్స్  భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కర‌ణ కార్య‌క్రమం బుధ‌వారం జ‌రిగింది. ఈ సందర్భంగా సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి కేంద్ర కమిటి సభ్యుడు సాధనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… భారత విప్లవ ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యతను ప్రాముఖ్యతను సంతరించుకున్న రోజు ఏప్రిల్ 22వ తేదీ అని అన్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు లెనిన్ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని భారత విప్లవ కమ్యూనిస్టులు భారత కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్- లేనినిస్ట్ )- సిపిఐ ( ఎం-ఎల్ ) ను 1969 ఏప్రిల్ 22న ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. సిపిఐ, సిపిఐ (ఎం) పార్టీలు భారత విప్లవాన్ని సాధించగలరని ఆచరణాత్మకంగా గ్రహించిన విప్లవ కమ్యూనిస్టు శక్తులు ఏకమై దేశ వ్యాప్తంగా మార్క్సిజం- లేనిజం-మావో ఆలోచన విధానాన్ని ప్రాపంచిక దృక్పథంగా ఎంచుకొని నక్సల్ బ‌రీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగ‌ పోరాటాలు సాగించాయని పేర్కొన్నారు.

         ప్రపంచంలో నేడు మార్పులపై సామ్రాజ్యవాద దేశాలు ఎన్నో కుతంత్రాలను చేస్తున్నారన్నారు. మన దేశంలో పాలకవర్గ పార్టీలు, ముఖ్యంగా ఫాసిస్టు ఆర్ఎస్ఎస్‌, బీజేపీ ప్రభావంతో మతపరమైన, జాతి ఆధారిత ద్వేషాలను రెచ్చగొడుతున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజా పోరాటాలను విస్తరించాలి. కార్మిక వర్గ నాయకత్వంలో ప్రజా పోరాటాలను బలపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టియు జాతీయ ఉపాధ్యక్షులు బి.ప్రదీప్, సిపిఐ ( ఎం-ఎల్ ) న్యూ డెమోక్రసి హైదరాబాద్-రంగారెడ్డి-మేడ్చల్ జిల్లాల కార్యదర్శి జి.ఝాన్సీ, ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అరుణ, జి.అనురాధ, జిల్లా సహాయ కార్యదర్శి శివ బాబు, యాదన్న ఏఐకేఎంఎస్ నాయకులు మహేందర్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు గీత, కావేరి, పుష్ప, పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తీగల శ్యామ్, మల్లిక్, మణిమాల, పద్మ, రేణుక, సత్యనారాయణ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page