కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగుల‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలి – డెవ‌ల‌ప్‌మెంట్‌ సొసైటీ ఫ‌ర్ ద డెఫ్ రాష్ట్ర క‌మిటీ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగుల‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– డెవ‌ల‌ప్‌మెంట్‌ సొసైటీ ఫ‌ర్ ద డెఫ్ రాష్ట్ర క‌మిటీ డిమాండ్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 22, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ( డీఎస్‌డి ) రాష్ట్ర క‌మిటీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు హైద‌రాబాద్‌ ఇందిరాపార్కు ధ‌ర్నాచౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ ( డీఎస్‌డి ) రాష్ట్ర అధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి భార‌తి, ఉపాధ్య‌క్షుడు కాట‌మోని వెంక‌టేష్‌గౌడ్ లు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌కు పైగా అవుతున్నా దివ్యాంగుల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలేద‌న్నారు. దివ్యాంగుల వృద్ధుల‌కు పెన్ష‌న్ ఇవ్వ‌క‌పోతే వారు ఎలా జీవించాల‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని, దివ్యాంగుల వృద్ధుల‌కు రూ.4 వేల నుంచి రూ.6 వేల‌కు పెంచి పెన్ష‌న్ ఇవ్వాల‌ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల‌కు టిజిఎస్ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని, ఉద్యోగాల క్యాలెండ‌ర్‌లో నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసి, భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆర్‌పిడ‌బ్ల్యుడి యాక్ట్‌-2016ను ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో దివ్యాంగుల‌కు రిజ‌ర్వేష‌న్ కేటాయించి పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాలో దివ్యాంగుల సంఘం నాయ‌కులు మ‌హ్మ‌ద్ మున్నా, న‌ర్సింహా, వెంక‌టేశ్వ‌ర్లు, చంద్ర‌శేఖ‌ర్ తో పాటు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page