Friday, September 18, 2026
HomeHyderabadనియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం – ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే నా ల‌క్ష్యం

– ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, నవంబర్ 27, అద్దం న్యూస్ :   నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధే త‌న ల‌క్ష్యం అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ముషీరాబాద్ డివిజ‌న్ వినోభాన‌గ‌ర్‌లో రూ.4.50 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్ట‌నున్న డ్రైనేజి పైప్‌లైన్ ప‌నుల ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై అధికారుల‌తో క‌లిసి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే ఉన్న పెండింగ్ ప‌నుల‌ను ద‌శ‌ల వారిగా పూర్తి చేస్తున్నామ‌న్నారు. ప్ర‌ధానంగా మంచినీటి, డ్రైనేజీ, రోడ్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిధుల‌ను కేటాయిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిల‌క‌ల‌గూడ వాట‌ర్‌వ‌ర్క్స్ డిజిఎం మోహ‌న్‌రాజ్‌, మేనేజ‌ర్ సురేష్‌, ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్‌ పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్‌, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, సత్యనారాయణ బాబు, అనిల్ కుమార్ టిల్లు, వెంకటేష్, జావీద్‌ ఖాన్, బలవంత్ రాజ్, సర్వర్, జఫ‌ర్‌ఖాన్, రాజు ముదిరాజ్, దీన్‌ద‌యాల్, బిజెపి డివిజ‌న్ అధ్య‌క్షుడు కంచికుమార్ ముదిరాజ్‌, గ‌డ్డం న‌వీన్‌, బ‌స్తీ వాసులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page