హైదరాబాద్, అద్దం న్యూస్: భారత రాజ్యాంగం పది కాలాల పాటు పదిలంగా వర్ధిల్లాలంటే పల్లె పల్లెన కళాకారులచే ప్రచారం చేయాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టిపిఎస్‌కె హాల్‌లో మంచికి శ్రీకారం ఉగాది పండుగ రోజున భారత రాజ్యాంగ శ్రవణం చేశారు. అనంతరం భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటికి రాజ్యాంగమే దేశానికి రహదారి అని కొనియాడారు. జ్యోతీష్యానికి శాస్త్రీయ ప్రమాణాలు లేవని… ముందు జరగబోయేది ఎవ్వరూ చెప్పలేరన్నారు. పంచాంగాలు ప్రపంచ గతిని మార్చలేదని… విజ్ఞానం పరిశోధన ఆచరణే మార్గదర్శకాలని అన్నారు. పండుగలంటే ఆనందానికి నిలయాలు పండుగలు అని అన్నారు.కళాకారుల జేఏసీ చైర్మన్ మురళీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ… ఉగాది కాంతి కళాకారులకెక్కడ ? కోకిల రాగాలు తప్ప కాంగ్రెస్ హామీ లెక్కడ ? అ ని ప్రశ్నించారు. కళాకారుల సంక్షేమం పచ్చడి ఎవ్వరికీ పోశారన్నారు. ఉగాది మాట తప్పని చేతల వాగ్దానం చేస్తుందా ? తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జి.నరేష్ అద్యక్షతన జరిగింది బావి భారత పౌరుడి చేతి లో భారత రాజ్యాంగాన్ని పట్టించి భారత రాజ్యాంగం పై ప్రమాణం చేశారు. రాజ్యాంగ శ్రవణం చేశారు .ఉగాది కవితలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో టిపిఎస్ కే నాయకులు పి.నాగేశ్వరరావు, మహేష్, డప్పు స్వామి, రాజయ్య గౌడ్, యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్ , బ్రాహ్మణి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply