బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే
బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం
బీసీలను నమ్మించి మోస గించిన కాంగ్రెస్
బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బిజెపి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేలా జేఏసీ ఉద్యమం
ఈ నెల 25న దిష్టిబొమ్మల దహనం, 30న బీసీల యుద్ధభేరి, 9న పార్లమెంటు ముట్టడి
» బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
బీసీ రిజర్వేషన్ల పరిష్కారానికి మోడీ చొరవ తీసుకుంటాడని విశ్వసిస్తున్న
గ్రామస్థాయి నుండి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి
» మాజీ గవర్నర్ దత్తాత్రేయ
సీఎం, పీసీసీ చీఫ్ లతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రయత్నిస్తాం
రాహుల్ గాంధీని కలిసి పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని
కోరుతం
బీసీ బిడ్డలుగా బీసీ జేఏసీ ఉద్యమానికి మద్దతిస్తున్నాం
» విహెచ్, మధు యాష్కీల వెల్లడి
కోర్టులలో బీసీలకు న్యాయం జరగదు
బీసీ రిజర్వేషన్ల సాధనకు జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ ఒకటి కావాలి
బిజెపి, కాంగ్రెస్ లను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటించాలి
» జస్టిస్ చంద్రకుమార్
బీసీ జేఏసీ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, నవంబర్ 21, అద్దం న్యూస్ : బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి దేశంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, ఎందుకు రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్, బిజెపిలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని లేనిపక్షంలో, ఆయా పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కాచిగూడ హోటల్ అభినందన్ గ్రాండ్‌లో బీసీ రిజర్వేషన్లు – సర్పంచ్ ఎన్నికలు – భవిష్యత్ కార్యాచరణ పై బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగింది. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్, హై కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, సినీ దర్శకులు ఎన్.శంకర్, తెలంగాణ విఠల్ పాల్గొన్నారు. ఈ జేఏసీ సమావేశంలో 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, 20 ఉద్యోగ సంఘాల నేతలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతల తో వందలాదిమంది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… దొడ్డి దారిన బీసీలను నమ్మించి మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుందని, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలని బీసీలు కోరుతుంటే పార్టీ పరంగా ఇస్తామంటూ మాట మారుస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ప్రకటించాల్సిన పార్టీ పరమైన రిజర్వేషన్లను క్యాబినెట్లో ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు, బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ సంఘాలు, కుల సంఘాలు మేధావులతో చర్చించాలని, సర్పంచ్ ఎన్నికలకు ముందే సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని, డిసెంబర్ మొదటివారం నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంటులో ప్రవేటు బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని అందులో భాగంగానే ఈ నెల 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 30 న బీసీల రాజకీయ యుద్ధభేరి సభ, డిసెంబరు 9న పార్లమెంట్ ముట్టడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు సాగాలని తాను కోరుకుంటునాన్నారు, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందని, బీసీల ఆకాంక్షలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించడానికి కృషి చేస్తాడని విశ్వాసం తనకుందన్నారు. అడగకుంటే అమ్మాయినా అన్నం పెట్టదని, అందుకే బీసీలు తమ హక్కుల సాధన కోసం గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. బీసీ జేఏసీ ఉద్యమానికి తన ముందుగా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు.
టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, పిసిసి మాజి అధ్యక్షుడు వి.హనుమంతరావు లు మాట్లాడుతూ… కేంద్రంలో ఉన్న బిజెపి మోకాల అడ్డడం తోని బీసీ రిజర్వేషన్ల సమస్య మొదటికి వచ్చిందని, ఈరోజు బీసీలలో వస్తున్న ఉద్యమాన్ని గుర్తించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టానికి ఈ పార్లమెంట్ సమస్యలను ఆమోదించాలని వారూ కోరారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బిసి జేఏసీ చేస్తున్న ఆందోళన దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లతో మాట్లాడి బీసీ రిజర్వేషన్ల విషయంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లడం, రాహుల్ గాంధీ తో మాట్లాడి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లు ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ పార్టీ పెట్టెల కృషి చేస్తామని, బీసీ జేఏసీ తలపెట్టిన ఛలో ఢిల్లీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు తెలియజేశారు.
హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ… అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు దేశంలో 50 శాతం సీలింగ్ దాటినప్పుడు లేని అభ్యంతరాలు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే కోర్టులకు ఎందుకు అభ్యంతరాలని, కోర్టులో కూడా బీసీలకు న్యాయం జరగదని బీసీ రిజర్వేషన్ల విషయంలో తేలీ పోయిందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బిజెపి ఇద్దరు మోసం చేస్తున్నారని వీరిని బీసీ వ్యతిరేకులుగా ప్రకటించాలని ఆయన కోరారు.
బిసి జేఏసీ తీర్మానాలు :
చట్టబద్ధమైన 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికలను తక్షణమే ఆపివేయాలని, పార్టీలపరంగా బీసీలకు 42 శాతం ఇస్తామన్న రిజర్వేషన్ ను అంగీకరించేది లేదు, బీసీలకు భిక్షంగా ఇచ్చే వాటా వద్దు.. రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటా కావాల్సిందే అని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగనలో బీసీల జనాభా 56 శాతం లెక్క తేలితే, ఇప్పుడు 42 శాతం ఇస్తామనడం బీసీలను రాజకీయంగా వంచించడమే అవుతుందని, బీసీ రిజర్వేషన్ల అంశంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతో చర్చించాలని, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధ మైన సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ జరపాలని తీర్మానం చేశారు. అలాగే డిసెంబర్ ఒకటవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ నుండి బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి మోసం చేయకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడానికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తరఫున పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడానికి ఢిల్లీలో రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించే అవకాశం ఉన్నప్పటికీ, సర్పంచ్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు లు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని, తాము అధికారంలోకొస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటించిన బిజెపి పార్టీకి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశంపై తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ నీ ఒప్పించి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లుకు ఆమోదం తెలిపేలా కృషి చేయాలని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ తర్వాత నవంబర్ 2 న రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయించిన అష్టాంగ ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే 6 న పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు, 13 న ధర్మ పోరాట దీక్షలు, 16 న వన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీలు, 18 న ఎంపీలతో ములకత్, రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు ధర్నాలు నిర్వహించిన బిసి శ్రేణులకు అభినందనలు, ఇక ఈ నెల నవంబర్ 25 న రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దగ్ధం, 30 న బీసీల రాజకీయ యుద్ధ భేరి పేరుతో ఛలో హైదరాబాద్, డిసెంబర్ 8 9 చలో ఢిల్లీ పేరుతో పార్లమెంటు ముట్టడి తదితర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో-ఛైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, ప్రొఫెసర్ సంఘనీ మల్లేశ్వర్, ప్రొఫెసర్ బాగయ్య, పుట్టం పురుషోత్తం, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కుర్మా, ఉప్పరి శేఖర్ సగర, చంద్రశేఖర్ గౌడ్, బి.మణి మంజరి, దీటి మల్లయ్య, వీరస్వామి, తీగల ప్రదీప్ గౌడ్, జుర్రీ గల శ్రీనివాస్, జిల్లెల్ల నరసింహ, గడిల కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply