Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadపిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 13, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో శుక్ర‌వారం సామూహిక అక్ష‌రాభ్యాసం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ మాజ‌రై చిన్నారుల‌తో సామూహిక అక్ష‌రాభ్యాసం చేయించారు. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌తో నూత‌న బ‌ల‌క బ‌ల‌పంతో అక్ష‌రాల‌ను దిద్దించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది ఉన్నతమైన స్థానాలలో ఉన్నారన్నారు. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా చేరిన పిల్లలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో భవిష్యత్తులో గొప్ప విద్యా వేత్తలుగా తప్పక ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి స్థానిక కార్పొరేటర్‌గా తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాస్, టీచర్లు మేరిబా, శోభారాణి, సునీత, సౌజన్య, ప్రవాళిక, బీజేపీ నేతలు శ్రీకాంత్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page