Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadమాన్‌సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

మాన్‌సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వద్ద మంగళవారం మాన్‌సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, జిహెచ్ఎంసి స‌ర్కిల్ – 15 డిప్యూటీ కమిషనర్ రామానుజన్ రెడ్డి, ఏఎంహెచ్ఓ డాక్టర్ ప్రవీణ తో కలిసి ప్రారంభించారు. ఎక్కడ ఫిర్యాదులు లేకుండా శానిటేషన్ డ్రైవ్ పూర్తి చేయాలని జిహెచ్ఎంసి సిబ్బందికి కార్పొరేటర్ పావ‌ని ఆదేశించారు. వర్షా కాలం దృష్ట్యా రోడ్లు, కాలనీలు, బస్తీల్లో పేరుకుపోయిన మట్టి కుప్పలు, చెత్త చెదారం తొలగించేందుకు జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసిందని కార్పొరేటర్ పావ‌ని తెలిపారు. ఈ మాన్‌సూన్‌ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ మూడు రోజులు గాంధీనగర్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆనంద్‌రావు, బిజెపి నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, పి.నర్సింగ్ రావు, ఆకుల సురేందర్, సత్తి రెడ్డి, ఎస్ఎఫ్ఎ లు రాజ్ కుమార్, సోమేష్, శివ కుమార్, గోపాలకృష్ణ, ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page