Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadబిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలి –...

బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలి – సీపీఎం గ్రేటర్ కన్వీనర్ మహేందర్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్  24, అద్దం న్యూస్ :    అభివృద్ధి పనులపై ఆటంకం కలిగిస్తున్న‌ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సీపీఎం గ్రేటర్ కన్వీనర్ మహేందర్ కోరారు. మంగ‌ళ‌వారం బ‌తుక‌మ్మ‌కుంట వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ… బతుకమ్మ కుంటని అభివృద్ధి చేస్తుంటే బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పదే పదే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖ నుండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచ్చేసి బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి చూపిన ధ్రువ పత్రాలు బేఖాతరని, హై కోర్టు తీర్పు కూడా చెల్లదని తేల్చి చెప్పారని మ‌హేంద‌ర్ గుర్తు చేశారు. అంతే కాకుండా సదరు బతుకమ్మకుంట స్థలం వద్ద వెళ్లి కాంట్రాక్టర్‌ను బెదిరించడం తగదని హెచ్చరించారు. ఏమైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాథన్ కు విన్నవించుకోవాలని హితవు పలికారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page