బాబు జగ్జీవ‌న్‌రామ్‌ జయంతిలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

 

హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భారత మాజీ ఉప ప్ర‌ధాని డాక్ట‌ర్‌.బాబూ జగ్జీవ‌న్‌రామ్‌ జయంతి కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గంలోని గాంధీనగర్ డివిజన్‌లో అరుంధతిన‌గ‌ర్‌, ఆంధ్రాకేఫ్ చౌరస్తా త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన బాబూ జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి కార్య‌క్ర‌మాలకు ముఖ్య అతిథిగా స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్ర‌హానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన బాబూ జగ్జీవ‌న్‌రామ్‌ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామన్నారు. జగ్జీవ‌న్‌రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, దళిత మోర్చ అధ్యక్షులు సత్యేందర్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, మహమూద్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, నర్సింహ, సాయి కుమార్, సంయుక్త రాణి, సురేష్, శ్రీనివాస్, చిర్ర యాదగిరి, రాజేందర్, సుక్క యాదగిరి, లక్ష్మణ్ యాదవ్, నీరజ్‌, శ్రీనివాస్ యాదవ్, పి.రాజ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, జి.డి.రాజు తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page