Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :   అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. శ్రీ డివైన్ పవర్ యోగా సెంటర్ స్థాపకులు యోగా గురు శ్రీ దేనన్ శిక్షణలో అందరు యోగా ఆసనాలు వేశారు. అనంతరం కార్పొరేటర్ పావ‌ని మాట్లాడుతూ… యోగ అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఒక ప్రాచీన అభ్యాసం అని.. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి, బలాన్ని ఆవశ్యతను పెంచడానికి సహాయపడుతుంద‌న్నారు. యోగా అనేది వ్యాయామం మాత్రమే కాదు, జీవన విధానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, సీనియర్ నేతలు దామోదర్, శ్రీకాంత్, పి.నర్సింగ్ రావు, సత్తి రెడ్డి, సురేష్ రాజు, దోనేటి సత్యం, సత్యేంధ‌ర్‌, సంయుక్తా రాణి, పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నండూరి శ్రీనివాస్, వివి సుబ్బారావు, రజినీకాంత్, అఖిలేష్, ఆంజనేయులు, కాలనీ మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page