హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలతో కూడిన పిపి కిట్లను గాంధీనగర్ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులకు అందచేత కార్యక్రమం జరిగింది. సోమవారం జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు పిపి కిట్లను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతిరోజు రోడ్ల పై చెత్త చెదారం తొలగిస్తూ శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పని చేసే సమయంలో ఉపయోగించుకొనే సామాగ్రి, వస్త్రాలు, సబ్బులు, నూనె, పలు వస్తువులతో కూడిన పిపి కిట్లను జిహెచ్ఎంసి ద్వారా కార్మికులకు అందజేయడం సంతోషకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఎ లు సోమేష్, రాజ్ కుమార్, శివ కుమార్, ఆనంద్, బీజేపి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్‌టి రాజు, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్, సురేష్, నర్సింహ, సాయి కుమార్, నీరజ్, ప్రశాంత్, సంధ్యా రాణి, పూర్ణ, సంయుక్త రాణి, సుహాసిని పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply