బోనాల పండుగ ఏర్పాట్ల పై
జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్‌తో సమీక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 11, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో ఈ నెల 20వ తేదీన జరుగనున్న తెలంగాణ బోనాల పండుగ ఉత్సవాల కోసం జరిగే పెండింగ్ పనుల పై శుక్రవారం జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్‌తో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సమీక్షించారు. డివిజన్‌లోని అమ్మవార్ల దేవాలయాల వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టి కుప్పలను తొలగించేందుకు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయాలని, బోనాలతో దేవాలయాలకు వచ్చే మహిళలకు, భక్తులకు అసౌకర్యం కలుగకుండా రోడ్లపై గుంతలను పూడ్చేందుకు ప్యాచ్ వర్క్ పనులను జరిపించాలని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జెడ్‌సిని కోరారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది డివిజన్‌లోని దేవాలయాలకు సరిపడే విధంగా ఐదు వందల ( 500 ) లైట్ల ఏర్పాటు చేయాలని కోరారు. జిహెచ్ఎంసి ద్వారా ముందస్తు పండుగ ఏర్పాట్లను పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాలని కార్పొరేటర్ పావని కోరారు. వాటితో పాటు డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని జోనల్ కమిషనర్ కు సూచించారు. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రవి కిరణ్ బోనాల పండుగ ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని, అలాగే డివిజన్‌లో పెండింగ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply