Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaనూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

నూతన స్ట్రీట్ లైట్ల‌ ఏర్పాటును పర్యవేక్షించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, అద్దం న్యూస్ : ప్రజల విజ్ఞప్తి మేరకు వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా సోమవారం జవహర్‌న‌గ‌ర్‌ కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన హైమాస్ట్ లైట్ల‌ను కార్పొరేటర్ పావ‌ని  ప్రారంభించారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విధి దీపాలు వెలగడం లేదని, పలు కాలనీలు బస్తీల్లో రాత్రిళ్ళు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమన్న స్థానికుల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ సమస్య తీవ్రతను అధికారులకు వివరించి, గడిచినా వారం రోజులుగా సుమారు 50 కి పైగా నూతన స్ట్రీట్ లైట్ల‌ను సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… ముందుగా సమస్య తీవ్రంగా వున్నచోట స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించామని, మరికొన్ని చోట్ల డార్క్ స్పాట్స్‌ను గుర్తించి వెంటనే లైట్లను ఏర్పాటు చేయిస్తున్నామని కార్పొరేటర్ పావని తెలిపారు. స్ట్రీట్ లైట్స్‌తో పాటు అవసరమున్న చోట హై మాస్ట్ లైట్లను సైతం ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, బీజేపీ నేతలు, ఆకుల సురేందర్, జ్ఞానేశ్వర్, అరుణ్ కుమార్, ప్రశాంత్ స్ట్రీట్ లైట్స్ సర్కిల్ డిప్యూటీ ఇంజనీర్ అశోక్ కుమార్, సిబ్బంది బాలు నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page