చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్‌లో ఎల‌క్ట్రిక‌ల్ బంచ్ కేబుల్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్‌లో ఎల‌క్ట్రిక‌ల్ బంచ్ కేబుల్ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్


హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎల‌క్ట్రిక‌ల్ బంచ్ కేబుల్ ప‌నుల‌ను స్థానిక కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌రిశీలించారు. చాలా కాలంగా ఇళ్ల మ‌ధ్య‌లో ప్ర‌మాద‌క‌రంగా వేలాడుతున్న ఎల‌క్ట్రిక‌ల్ వైర్ల‌ను తొల‌గించి బంచ్ కేబుల్‌ను ఏర్పాటు చేయాల‌ని బాపూన‌గ‌ర్ బ‌స్తీవాసులు కార్పొరేట‌ర్ పావ‌నికి ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన కార్పొరేట‌ర్ పావ‌ని ఇందిరాపార్క్ విద్యుత్ శాఖ ఏఈ గోపాల‌కృష్ణ‌తో స‌మీక్షించి బంచ్ కేబుల్‌ను ఏర్పాటు చేయించారు. గురువారం ఆమె బంచ్ కేబుల్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఇళ్ల మ‌ధ్య‌లో ప్ర‌మాద‌క‌రంగా ఉన్న విద్యుత్ తీగ‌ల‌ను తొల‌గించి బంచ్ కేబుల్‌ను ఏర్పాటు చేయించిన కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్‌కు బ‌స్తీవాసులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్‌, బిజెపి నాయ‌కులు దామోదర్, రాజేందర్, బ‌స్తీవాసులు శ్రీనివాస్, శోభ, కోటేశ్వరీ, అమృత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page