హైదరాబాద్, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్ బస్తీలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన మంచినీటి పైప్‌లైన్లను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రానున్న రంజాన్, ఉగాది పండుగలలోపు పైప్‌లైన్ పనులను పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్‌ను కార్పొరేటర్ పావని ఆదేశించారు. అదే విధంగా పనుల్లో నాణ్యతాప్రామాణాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెపి ఓబిసి మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఉమేష్, నాయకులు కుమార్, ఆనంద్‌రావు, సాయికుమార్, నీరజ్, బస్తీవాసులు నర్సింగ్‌రావు, లక్ష్మణ్, ధన్‌రాజ్, చందు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply