స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్‌లోని అరుంధతినగర్ బస్తీలో, జవహర్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, ఎస్ఆర్‌టి కాలనీలో, చిక్కడపల్లి బాపూనగర్ బస్తీలో, వివేక్‌నగర్, అశోక్‌నగర్ చౌరస్తాలో, మళ్యాలం చర్చీ వీధిలో, జనప్రియ అపార్ట్‌మెంట్ సర్కిల్‌లో, గోల్కొండ చౌరస్తాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, ప్రకాష్, యాదవ్, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, హన్మంతు, సాయి కుమార్, నీరజ్, చిర్ర యాదగిరి, రహమత్ అలి, జ్ఞానేశ్వర్, సంతోష్, సంపత్ యాదవ్, సంధ్యా రాణి, సంయుక్త రాణి, పూర్ణ, కృష్ణవేణి, బిజెపి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply