ఉగ్రదాడుల మృతులకు నివాళి అర్పించిన
కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

నివాళులర్పిస్తున్న కార్పొరేటర్ పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మశాంతి జరగాలని కోరుతూ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బిజెవైఎం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్‌లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాండిళ్లతో ఉగ్రదాడుల మృతులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు నవీన్, బిజెపి నాయకులు శ్రీకాంత్, మహమూద్, సత్తిరెడ్డి, ప్రకాష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శివ కుమార్, మదన్మోహన్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, నర్సింహా, సాయి కుమార్, ఆనంద్ రావు, దోనేటి సత్యం, సత్యేందర్, హన్మంతు, కుమార్, సాయి, బిజెవైఎం నాయకులు అరుణ్‌కుమార్, నీరజ్, సాయి తరుణ్, సంపత్ యాదవ్, రాహుల్, సాయితేజ, భాను, చిన్న, అభిషేక్, ప్రశాంత్, రాజ్‌కుమార్, సంధ్యారాణి, స్వప్న, సంయుక్త రాణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply