కాచిగూడ, ఏప్రిల్ 29, అద్దం న్యూస్ : మే 27వ తేదీన ఆహ్వానం రిసార్ట్స్ వేలాది మంది వైశ్య ప్రముఖుల సమక్షంలో జరిగే వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ షీల్డ్‌ను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆవిష్కరించారు. వైశ్యుల్లో ఉన్న అణిముత్యాలను గుర్తించి వారు అందిస్తున్న సేవలకుగాను వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ఘనంగా సత్కరించనున్నట్లు వైశ్య అచీవర్స్ అవార్డ్స్ చైర్మన్ మడిపడిగే రాజు తెలిపారు. అవార్డ్స్ కోసం ఎంపిక చేయడానికి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి జగదీశ్వర్ చైర్మన్ జ్యూరి కమిటీని ఐదుగురు సభ్యులు, ఐదుగురు అడ్వయిజర్లతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైవ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, వైశ్య ప్రముఖులు బండారు సుబ్బారావు, కెపిసి అనిల్, మడిపడిగ రాము, డైరెక్టర్స్ ఎం.నరేష్, నీలిమా, జి.కళ్యాణి, కె.రవి, పి.శివకుమార్, డాక్టర్ జగన్, అరుణ్, సతీష్, సంతోష్ చేగు, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply