Saturday, September 19, 2026
No menu items!
HomeHealth-Tipsఅర్ధరాత్రి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ పావని

అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ పావని

📰 Generate e-Paper Clip

అర్ధరాత్రి రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ పావని

హైదరాబాద్, డిసెంబ‌ర్ 11, అద్దం న్యూస్ :    ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో ఇటీవ‌ల రూ.21 ల‌క్ష‌ల నిధుల‌తో చేప‌ట్టిన సిసి రోడ్డు ప్యాచ్ వ‌ర్క్ ప‌నులు బుధ‌వారం అర్థ‌రాత్రి ప్రారంభ‌మయ్యాయి. ఈ ప‌నుల‌ను ఆక‌స్మికంగా స్థానిక గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌ర్య‌వేక్షించారు. అక్కడే ఉన్న జిహెచ్ఎంసి ఏఈ అబ్దుల్ స‌లామ్‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడారు. అర్ధరాత్రి సమయంలో కాంట్రాక్టర్ తో పాటు ఉండి పనులను జరిపిస్తున్నందుకు ఏఈ ని అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండడమే కాకుండా, డివిజన్‌లో జరిగే అభివృద్ధి పనులను పటిష్టంగా జరిగేందుకు సమయంతో పని లేకుండా అర్ధరాత్రి కూడా పనులను తనిఖీలు చేసేందుకు కార్పొరేటర్‌గా తాను ముందుంటానని పావ‌ని తెలిపారు. అర్ధరాత్రి కార్పొరేటర్ ను చూసిన పలువురు స్థానికులు అభివృద్ధి పనులపై కార్పొరేటర్‌కు ఉన్న ఆసక్తి పై హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యవేక్షణలో కార్పొరేటర్ తో పాటు బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, బిజెవైఎం నాయకులు జి.అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page