తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
హైదరాబాద్, మే 23, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కో–కన్వీనర్, ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్‌టి.రామారావు జయంతి సందర్భంగా కడపలో నిర్వహించే మహానాడు–2025 నిర్వహణ కమిటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కో–కన్వీనర్ సాయిబాబా ఆధ్వర్యంలో శుక్రవారం దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహానాడులో నిర్వహించే సాంస్కృతిక కమిటీ కార్యక్రమాల కన్వీనర్ గుమ్మడి గోపాలకృష్ణ, నరసింహ ప్రసాద్ లతో ఫోనులో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… తెలంగాణ సాంప్రదాయ కళలైనా పల్లె సుద్దులు, చిందు, యక్షగానం, జానపద పాటలకు ఆదరణ కల్పిస్తూ ఆ పాటల్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, ప్రగతి, కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరిస్తామన్నారు. తెలుగుదేశం హయాంలో హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి, ప్రజల హృదయాల్లో కలకాలం నిలిచేపోయే విధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించడం కొరకు సమావేశం చర్చించడం జిరిగిందన్నారు. స్వర్గీయ ఎన్‌టి.రామారావు ఎటువంటి లక్ష్యాలు, ఆశయాలు, సిద్దాంతాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ లక్ష్య సాధన దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉండి చేస్తున్న, చేపట్టిన కార్యక్రమాలన్నీ వివరిస్తూ పాటల రూపకల్పన చేసారన్నారు. దీనికి తెలంగాణ కళాకారులు ఎస్‌కె.రాజు బృందం, ఇటీవలే భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కార గ్రహీత సమ్మయ్య ఆధ్వర్యంలో ఒగ్గుకథ రూపంలో పాటలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఒగ్గుకథ, చిందు, బాగోతం, వీటన్నిటిని సభకు విచ్చేసిన వీక్షకులకు అలరించే ప్రయత్నం జరుగుతుందని సాయిబాబా తెలిపారు. ఈ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులు సూర్యదేవర లత, వెంకట గాంధీ, టి.రాము తదితరులతో పాటు పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ లు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply