సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

 

సిటీ కల్చరల్, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యురాలు డాక్టర్ ఎస్‌పి.భారతి అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలలో నాలుగో రోజు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి అనేక విలక్షణమైన కార్యక్రమాలకు శ్రీకరం చుట్టి కళలు, కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్నారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ప్రముఖ సినీ నటుడు సివిల్ నరసింహారావు, సి.అనురాధ అడ్వకేట్, ( బతుకు జట్కాబండి ఫేమ్ ) పాల్గొన్నారు. సభకు ముందు డాక్టర్ జి.కుమార స్వామి బృందం చెక్క భజనతో పాటు కూచిపూడి డ్యాన్స్ గాయత్రి స్కూల్ వ్యవస్థాపకురాలు కె.జ్యోతి శేఖర్, విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page