నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
సరస్వతి దేవి రూపంలో అమ్మవారి అలంకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు మండపంలో అమ్మవారిని సోమవారం శ్రీ సరస్వతీ దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా నేతాజి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు పలుస బాల్‌రాజ్‌గౌడ్ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply