అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు హైవేలపై దట్టంగా అలముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుతో హైదరాబాద్- బెంగళూరు హైవేపై నాలుగు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డుపైనా పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు.
పొగమంచు కారణంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్-ఘట్‌కేసర్ బైపాస్ మార్గంలో పది అడుగుల దూరంలోని వాహనాలు కూడా కనిపించడం లేదు. సూర్యోదయం తర్వాత కూడా పొగమంచు దట్టంగా అలముకుంది. ఇంతగా ఎప్పుడూ చూడలేదని వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply