
హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన గుండెల్లి దేవి వర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇప్పటికే దేవి వరప్రసాద్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం బోర్డ్ మెంబర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా దేవి వర ప్రసాద్ మాట్లాడుతూ… తన పై నమ్మకంతో తనను సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా నియమించినందుకు టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సి బి.మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం పాటుపడుతానని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేందుకు కృషి చేస్తానన్నారు.![]()

![]()












Leave a Reply