Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎంఐఎం ఎమ్మెల్సి ర‌హ‌మ‌త్ బేగ్ ను స‌స్సెండ్ చేయాల‌ని ధ‌ర్నా

ఎంఐఎం ఎమ్మెల్సి ర‌హ‌మ‌త్ బేగ్ ను స‌స్సెండ్ చేయాల‌ని ధ‌ర్నా

📰 Generate e-Paper Clip

బిజెపి ఎస్సీ మోర్చ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో
ఎంఐఎం ఎమ్మెల్సి ర‌హ‌మ‌త్ బేగ్ ను స‌స్సెండ్ చేయాల‌ని ధ‌ర్నా

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 29, ( అద్దం న్యూస్ ) :   బాలికపై అత్యాచారం చేసినట్లు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా ర‌హ‌మ‌త్ బేగ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని, ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని చేయాల‌ని బిజెపి ఎస్సీ మోర్చా సికింద్రాబాద్ మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డం న‌వీన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సి ర‌హ‌మ‌త్ బేగ్ పై వ‌స్తున్న అత్యాచారం ఆరోప‌ణ‌ల పై ఎంఐఎం అగ్ర‌నేత అస‌దుద్దీన్ స్పందించాల‌ని, బేగ్‌ను ఎమ్మెల్సి ప‌ద‌వి నుంచి తొల‌గించి, పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌డ్డం న‌వీన్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌హ‌మ‌త్ బేగ్ చిత్ర ప‌టాల‌ను ద‌హ‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు ఆయుష్, నందు, వాసు, ఎం.సురేష్, నవీన్, నరేష్, సాయిలు, సన్నీ, రాకేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page