Friday, September 18, 2026
Homecinemaఆయనకి సాష్టాంగ నమస్కారం : Harish Shankar

ఆయనకి సాష్టాంగ నమస్కారం : Harish Shankar

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. సాంగ్ లాక్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. DSP అంటే తనకు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదని, అతనంటే తనకి ప్రాణమని అన్నారు.

వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు . మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ‘దేఖ్లేంగే సాలా’ అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ”ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడుకి దండం పెట్టి రోజుని ప్రారంభించడం మనందరికీ అనాదిగా వస్తున్న ఆచారం. ఆదిత్యుడికి, ఆ భాస్కరుడికి దండం పెట్టి రోజుని మొదలు పెడతాం. ఈ సినిమా ప్రమోషన్స్ అంతే ఎనర్జీతో, అంతే పవిత్రంగా, అంతే ఇష్టంగా, ఆదిత్య యూనివర్సిటీ నుంచి మొదలెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్ లో రెండే కటౌట్లు ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ ది.. ఇంకొకటి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ది. ”దేవిశ్రీ ప్రసాద్ గారి మీద మా గౌరవం, ప్రేమ చూపించుకునే అవకాశం ఎప్పుడో గానీ రాదు. ఇది ఏదో మేము త్యాగం చేసామనో, లేకపోతే మా కటౌట్ వద్దు అనుకున్నామనో కాదు.

ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా గ్రాటిట్యూడ్, మా రెస్పెక్ట్ దేవిశ్రీకి చూపించడానికి మాత్రమే ఇంకెవరికీ కటౌట్ ఇక్కడ పెట్టలేదు. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేశాడనో, లేకపోతే ఆయన స్టేజ్ మీద ఉన్నాడని నేను చెప్పట్లేదు. ఆయన ‘ఆనందం’ సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు. నేను ‘ఆనందం’ సినిమా చూసి బయటిక వచ్చి లైఫ్ లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్టర్ తో పని చేస్తే చాలు దేవుడా అని కోరుకున్నాను. దేవుడు ఒక్కసారి కాదు.. మూడు సార్లు అవకాశం ఇచ్చాడు. ఇంకో మూడు సార్లు, ఇంకో మూడు సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”. ‘పుష్ప 2’ సినిమాతో 5 బిలియన్ వ్యూస్ ఉన్న ఆల్బం చేసిన వ్యక్తి. ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చా.. అక్కడ చేయొచ్చా అని అడుగుతూ.. మళ్ళీ ఫస్ట్ సినిమాకి పని చేసినట్టు పని చేసే ఆ వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయకుండా ఇంకేం చేయగలుగుతాం” అని హరీష్ శంకర్ అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page