కుప్పకూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తి మృతి

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న ‘న్యూ అహోబిలం’ ఆలయం కూలిపోవడం స్థానికంగా మరియు భారతీయ వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊహించని దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు.

మరణించిన భారతీయ వ్యక్తి..

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 52 ఏళ్ల విక్కీ జైరాజ్ పాండే అనే భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఈ నిర్మాణ ప్రాజెక్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సుమారు రెండేళ్లుగా ఆలయ నిర్మాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన విక్కీ పాండే ఇలా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు. దీంతో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో.. వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page