హైదరాబాద్, అక్టోబర్ 1, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మాజీ అధ్యక్షుడు మోజస్ లు ఇద్దరు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సమక్షంలోనే దుర్భాషలాడుతున్నారు. రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శంకర్ ముదిరాజ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై మాజీ అధ్యక్షుడు మోజస్ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ తన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. బుధవారం రాంనగర్ చౌరస్తాకు ఓ కార్యక్రమానికి వచ్చిన ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎదుటే రాంనగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ వచ్చి మోజస్‌తో వాగ్వాదానికి దిగాడు. తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కప్పివేస్తూ దాని పైనే నువ్వు నీ ఫ్లెక్సీని ఎందుకు ఏర్పాటు చేశావని నిలదీశాడు. ఈ విషయంలో శంకర్ ముదిరాజ్, మోజస్ లు ఇద్దరూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎదుటే దుర్భాషలాడుకున్నారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేయాలో తెలియక విస్తూపోయారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply