Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADబిజెపి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాల పంపిణీ

బిజెపి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

బిజెపి బహిరంగ సభ ఆహ్వాన కరపత్రాల పంపిణీ

హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) :  ఈ నెల 10వ తేదీ ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే బిజెపి బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికి, బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కోరారు. ఈ మేర‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్‌, వివేక్‌న‌గ‌ర్‌, కాపువాడ‌, పార్థివాడ త‌దిత‌ర బ‌స్తీల్లో, పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేష‌న్ కాల‌నీవాసుల‌కు, వాక‌ర్ల‌ను క‌లిసి విన‌య్ క‌ర‌ప‌త్రాల‌ను అంద‌చేశారు. మేధావులు, డాక్టర్లు, న్యాయ‌వాదులు, ఉన్నత విద్యావంతులు, నిరుద్యోగులు, బిజెపి అభిమానులు మోడి స‌భ‌కు భారీఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షుడు నవీన్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, సత్తి రెడ్డి, శ్రీనివాస్, సత్యేంధర్, లక్ష్మి, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page