Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఈ నెల 17న తెలుగుదేశం పార్టీ “ మిని మహానాడు ”

ఈ నెల 17న తెలుగుదేశం పార్టీ “ మిని మహానాడు ”

📰 Generate e-Paper Clip

ఈ నెల 17న తెలుగుదేశం పార్టీ
“ మిని మహానాడు ”

హైదరాబాద్, మే 8, ( అద్దం న్యూస్ ) :   విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగ‌త నందమూరి తారక రామారావు పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ మహానాడు ‘ను పండుగలా నిర్వహించుకోవడం మన ఆనవాయితీ, దీనిలో భాగంగా, ఈ సంవత్సరం మే 17వ తేదిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ “ మిని మహానాడు ” అత్యంత వైభవంగా నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో పార్టీ ముఖ్య నాయకుల కీలక సమావేశం నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్ర సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెళ్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా సతీష్, పోలంపల్లి అశోక్ లు విచ్చేసారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంటు ” మిని మహానాడు ” నిర్వహించాలని తీర్మానించారు.

“ మిని మహానాడు ” సందర్భంగా సికింద్రాబాద్ నగరాన్ని పసుపుమయం చేయాలని, నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధులన్నింటినీ పసుపు తోరణాలు, భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నగరాన్ని సుందరంగా అలంకరించాలని సమావేశంలో తీర్మానించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, కార్యకర్తల ఉత్సాహం ఉట్టిపడేలా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని సమావేశంలో తీర్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు తడక వినోద్, కాసుల సుదర్శన్ రెడ్డి, జి.అనిల్ కురుమ, శ్యాంసుందర్, భాను ప్రకాష్, కరణం కిరణ్, పరశురామ్, మల్లికార్జున, సాయి సుక్రవేది, ఏబిఆర్.మోహన్, వంశీకృష్ణ, ఓ.వెంకటేష్, ఎస్ఎం.లయీఖ్, విటల్, ఎంఎస్.సిద్ధిఖి, చంద్రమోహన్ గౌడ్, సత్యనారాయణ, బి.రాజు, పుప్పాల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page