అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు
పాశం సాయికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ
హైదరాబాద్, జూలై 4, ( అద్దం న్యూస్ ) : రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు పాశం సాయికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జెమిస్తాన్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.













Leave a Reply