బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో చీరల పంపిణీ

ముషీరాబాద్, ఆగస్టు 7, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు కల్వ గోపి ఆధ్వర్యంలో బిఎల్ఓలకు, అంగ‌న్‌వాడి టీచర్స్ కు, ఆశా వర్కర్లకు ఉచితంగా చీరలు పంపిణీ కార్య‌క్ర‌మం శుక్రవారం జ‌రిగింది. కవాడిగూడ డివిజన్ మజీద్ వద్ద SIR ఎన్యూమరేషన్ ఫారం ల ఫిల్లింగ్ హెల్ప్ డెస్క్ కార్యక్రమంలో ఈ చీరల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కల్వ గోపి తో కలిసి బిఎల్ఓలకు, అంగ‌న్‌వాడి టీచర్స్ కు, ఆశా వర్కర్లకు చీరలను అందచేశారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్య‌మ‌కారులు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బండ జుగేంద‌ర్ కుర్మ‌, కావలి సుధాక‌ర్‌, బల్లెక‌రి రాములు, బ‌ల్లెక‌రి ర‌మేష్‌, జై సింహ, సామల శ్రీనివాస్, నీలం వేణు యాదవ్, శ్యామ్ యాదవ్, రాజు యాదవ్, మధు, శేషు, మ‌హిళా నాయ‌కురాలు మాధ‌వి, మంజుల‌ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page